ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ విభాజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఏపీకి తమ రాజీనామాల వల్లే ప్రత్యేక హోదా వస్తుందని భావిస్తే ఈ క్షణమే రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ప్రత్యేక హోదాకు ఏదీ ప్రత్యామ్నాయం కాదని, ఎంత ఆర్థిక సాయం చేసినా దానివల్ల ఒరిగేదేమీ లేదన్నారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం సాగిస్తాం. మోడీ అనుకుంటే ఏపీకి హోదా వస్తుంది. బీజేపీ, టీడీపీ మేనిఫెస్టోల్లో ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన సంగతి మరచిపోతే ఎలా? చంద్రబాబు, వెంకయ్య కేంద్రాన్ని గట్టిగా అడిగితే హోదా వస్తుంది’ అని మేకపాటి గుర్తు చేశారు.