పేదరికాన్ని ఆసరాగా చేసుకుని బాలిక తల్లిదండ్రులకు నజరానా ఇచ్చాడో షేక్... వారి కూతురికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకోవడానికి తయారయిపోయాడు. ఇంతలోనే పోలీసులు రంగప్రవేశం చేయడంతో అసలు విషయం బయట పడింది. అరబ్ షేక్ నుంచి బాలికను విడిపించిన సంఘటన సోమవారం పాతబస్తీలో వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలికను వివాహమాడేందుకు యత్నించిన అరబ్షేక్ను పోలీసులు అరెస్టు చేశారు.