తెలంగాణ సర్కారుపై అక్బరుద్ధీన్ ఫైర్ : ఉస్మానియా, నిలోఫర్, గాంధీ ఆస్పత్రులూ..?

మంగళవారం, 25 నవంబరు 2014 (14:06 IST)
తెలంగాణ సర్కారుపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తెలంగాణ అసెంబ్లీలో ఫైర్ అయ్యారు. ప్రభుత్వం తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని విమర్శించారు. 
 
రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం సభ్యులను అదుపుచేసే ఉద్దేశంతో వుందని, అందుకని వాళ్ళతోపాటు తమని కూడా అసెంబ్లీలో మాట్లాడనివ్వకుండా చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ సర్కారు ప్రభుత్వ మేర్పడి ఇన్ని నెలలైనా నిలోఫర్, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రిలను సందర్శించిందా అని ప్రశ్నించారు. 
 
ప్రభుత్వ ఆస్పత్రిలో పేషెంట్ల పరిస్థితి చాలా దారుణంగా ఉందని, వారికి అత్యవసర వసతులు కూడా లేవని అక్బరుద్ధీన్ వాపోయారు. తెలంగాణ సర్కారు ప్రభుత్వ ఆస్పత్రుల పునరుద్ధరణపై ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని మండిపడ్డారు. 

వెబ్దునియా పై చదవండి