దొంగ ఓటర్లను టీడీపీ పోలింగ్ బూతుల్లోనే ఎందుకు పట్టుకోలేదు: రోజా

ఆదివారం, 18 ఏప్రియల్ 2021 (13:32 IST)
తిరుపతి ఉపఎన్నిక జరిగిన తీరుపై నగరి ఎమ్మెల్యే రోజా స్పందించారు. ఆపరేషన్ అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న ఆమె.. ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. వీడియో సందేశంలో ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ఒక్క రూపాయి కూడా పంచకుండా, మద్యం ఇవ్వకుండా, ప్రలోభాలకు గురి చేయకుండా సీఎం జగన్ కొత్త సంప్రదాయానికి తెర లేపారని ప్రశంసించారు. పాలన ద్వారా, సంక్షేమ పథకాల ద్వారా ఓటర్ల మనసును జగన్ గెలిచారన్నారు. 
 
తెలుగుదేశం పార్టీ ఓడిపోతారనే భయంతోనే దొంగ ఓట్ల పేరుతో తప్పుడు ప్రచారం చేస్తుందని.. ఇలాంటి ప్రచారం చేయటం వల్ల తమ ప్రతిష్ట ఏ మాత్రం దిగజారదని రోజా మండిపడ్డారు. మిగిలిన చోట్ల లేకుండా కేవలం తిరుపతిలో మాత్రమే ఎందుకు దొంగ ఓట్లు అన్నారని, రోడ్లపై డ్రామాను క్రియేట్ చేశారని ప్రశ్నించారు. 
 
జిల్లాకు పెద్ద అయిన పెద్దిరెడ్డిపై కక్షసాధింపుతోనే తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. దొంగ ఓటర్లను పోలింగ్ బూతుల్లో ఎందుకు పట్టుకోలేదన్నారు. కరోనా బాధితులకు జగన్ అద్భుతమైన వైద్యం అందించారని రోజా అన్నారు.

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు