ఏపీలో వాలంటీర్ల సేవలను కొనియాడిన ఎమ్మెల్యే రోజా

బుధవారం, 1 ఏప్రియల్ 2020 (19:39 IST)
ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ల సేవలను వైసీపీ ఎమ్మెల్యే రోజా కొనియాడారు. 'దేశం మొత్తం లాక్‌డౌన్‌లో ఉంటే.. పౌరులు ఇంట్లోనే ఉంటూ కొవిడ్-19తో పోరాడుతుంటే, మన ఏపీ విలేజ్‌ వారియర్స్‌ మాత్రం.. ఇబ్బందులు పడుతున్న వారికి సాయం అందిస్తూ పని చేస్తున్నారు. హ్యాట్సాఫ్‌ టు వాలంటీర్స్‌.. పింఛనులను డోర్‌ డెలివరీ చేస్తూ గొప్ప సేవలు అందిస్తున్నారు' అని ట్వీట్ చేశారు.
 
ఆంధ్రప్రదేశ్‌లో పింఛను లబ్ధిదారులకు అందాల్సిన డబ్బును కరోనా విజృంభణ నేపథ్యంలో గ్రామ వాలంటీర్లు అందిస్తున్నారు. బుధవారం ఉదయం 6 గంటల నుంచే లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందజేశారు. వేలి ముద్ర స్థానంలో ఫొటో గుర్తింపుతో పింఛన్లు అందజేస్తున్నారు. దీనిపై రోజా ప్రశంసల జల్లు కురిపించారు. 
 
ఇదిలా ఉంటే, చిత్తూరు జిల్లాలో ఒక్కరోజే కరోనా కేసులు ఐదు పాజిటివ్‌గా వచ్చాయి. ఢిల్లీలో జమాతాకు వెళ్లిన 185 మందిలో 79 మందిని గుర్తించి క్వారంటైన్‌కు తరలించారు. శ్రీకాళహస్తి 1, ఏర్పేడు 1, పలమనేరు 2, గంగవరం 1 పాజిటివ్‌గా వచ్చాయి. గతంలో శ్రీకాళహస్తితో కలిపి జిల్లాలో ఆరు కేసులు నమోదయ్యాయి. మరో 49 మందిని తిరుపతి పద్మావతిలోని క్వారంటైన్‌కు తరలించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు