కాంగ్రెస్‌ పార్టీకి జయంతి నటరాజన్ రాజీనామా..? వేధింపులే కారణమా..!

శుక్రవారం, 30 జనవరి 2015 (10:23 IST)
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీమంత్రి జయంతి నటరాజన్ పార్టీకి రాజీనామా చేయనున్నట్టు సమాచారం. జయంతి నటరాజన్ తన నిర్ణయాన్ని శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు విలేకర్ల సమావేశంలో వెల్లడించనున్నట్టు తెలుస్తోంది. జయంతి నటరాజన్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపైన, ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 
 
రాహుల్ గాంధీ చెప్పినట్లు చేయనందునే 2013లో కేబినెట్ నుంచి తనను బలవంతంగా తొలగించారని జయంతి నటరాజన్ విమర్శించారు. రాహుల్ కార్యాలయంలోనే తనపై కుట్ర పథకం సిద్ధమైందని ఆమె ఆరోపించారు. అంతేకాకుండా అనేక సందర్భాలలో పార్టీ అగ్ర నాయకత్వం తనను వేధించిందని జయంతి నటరాజన్ వ్యాఖ్యానించారు. కాగా జయంతి నటరాజన్ గత ఏడాది నవంబర్ నెలలో సోనియా గాంధీకి రాసిన లేఖ ఇప్పుడు లీకు అయింది. తాజాగా అది మీడియాకు లీకైనట్టు సమాచారం.

వెబ్దునియా పై చదవండి