ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేస్తూ, "నాకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయింది. నాకు కరోనా లక్షణాలు ఏవీ లేవు. అలాగే, బాగానే ఉన్నాను. కానీ, నేను కోలుకునేవరకు ఐసోలేషన్‌లో ఉంటాను. నన్ను కలిసివారంతా వెంటనే కోవిడ్ పరీక్షలు చేయించుకుని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను. ప్రతి ఒక్కరినీ సేఫ్‌గా ఉండాలని అర్థిస్తున్నాను" అని నారా లోకేశ్ పేర్కొన్నారు.