కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్ ఆంక్షలను, కోవిడ్ -19 మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. ప్రతి ఒక్కరు ఫేస్ మాస్క్‌లు ధరించడం, చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం, భౌతిక దూరాన్ని పాటించడం వంటివి తూ.చ తప్పకుండా పాటించాలన్నారు.
బహిరంగ ప్రదేశాలతో పాటు పని ప్రదేశాల్లోనూ విధిగా ఫేస్ మాస్క్‌లు ధరించాలని సూచించారు. చలి తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో శ్వాసకోశ సంబంధిత వ్యాధిగ్రస్తులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు తమ ఇళ్ళల్లోనూ, పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.