ప్రజారోగ్యానికి తిలోదకాలిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఆదాయం పెంచుకునేందుకు మార్గాలను మాత్రమే అన్వేషిస్తోందని విమర్శించారు. అందులో భాగంగానే బార్లకు అనుమతిచ్చి 20 శాతం కోవిడ్ ఫీజు, 10 శాతం ఏఈఆర్టీ విధించిందన్నారు. పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ.1 చొప్పున సెస్సు విధించి, ప్రజలపై రు.600 కోట్లు భారం మోపిందని మండిపడ్డారు.
ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.65 వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపిందని రామకృష్ణ తెలిపారు. ఈ ప్రభుత్వం కరోనాపై పోరాడుతున్న వైద్యులను గౌరవించకపోగా వారిపై వేధింపులకు, దాడులకు పాల్పడుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో 6,09,558 కరోనా కేసులు, 5244 మరణాలు సంభవించాయన్నారు.