కాగా, అనేక పరిణామాల నేపథ్యంలో ఆనందయ్య మందుకు అటు ఏపీ హైకోర్టు, ఇటు ఏపీ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిన విషయం తెల్సిందే. దీంతో ఆనందయ్య మందు తయారీ పెద్ద ఎత్తున ప్రారంభమవుతోంది.
ఇందుకోసం కృష్ణపట్నం పోర్టుకు సమీపంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే తయారీకి అవసరమైన సామగ్రిని కృష్ణపట్నం పోర్టుకు తరలించే పనులు మొదలు పెట్టారు. ప్రస్తుతం కృష్ణపట్నం పోర్టుకు చెందిన సీవీఆర్ కాంప్లెక్స్‌లో మూలికలు, దినుసులు సిద్ధం చేసుకోవడంలో ఆనందయ్య బృందం బిజీగా ఉంది.
అనంతరం కరోనా రోగులకు అవసరమైన పి, ఎల్, ఎఫ్ రకాల మందు పంపిణీ చేస్తారు. ఆ తర్వాతే ఇతర నియోజకవర్గాలకు పంపిణీ చేయనున్నారు. ఈ ఔషధ చక్ర మందును ఆన్‌లైన్‌లో కూడా పంపిణీ చేయనున్నారు.