వీటిపై స్పందించిన కోవిడ్ 19 ఇన్సిడెంట్ కమాండర్ మంగళగిరి తహసీల్ధార్ రామ్ ప్రసాద్ మాట్లాడుతూ పచారి షాపులు,కూరగాయలు,పండ్లు విక్రయ కేంద్రాలు మినహా ఏ విధమైన దుకాణాలూ తెరిచేందుకు అనుమతి లేదని అన్నారు.
మంగళగిరి పట్టణంలో 3 వ కేసు నమోదైన తరువాత 28 రోజుల వరకూ రెడ్ జోన్ నిబంధనలు అమలవుతాయి. ప్రక్క నే ఉన్న తాడేపల్లిలో మొత్తం 11 కేసులు నమోదు కావటంతో కంటైన్మెంట్,బఫర్ జోన్ నిబంధనల్ని పటిష్టంగా అమలు చేయనున్నట్లు రామ్ ప్రసాద్ తెలిపారు.