ఏఓబీలో మ‌రో మృత‌దేహం... అది ఆర్కేదేనా?

మంగళవారం, 1 నవంబరు 2016 (15:37 IST)
బ‌లిమెల‌: ఆంధ్రా, ఒరిస్సా స‌రిహ‌ద్దులో మ‌రో మావోయిస్టు మృత‌దేహం దొరికింది. అది ఎవ‌రిదో తెలియ‌ద‌ని పోలీసులు చెపుతున్నారు. కానీ, అది మావోయిస్టు కీల‌క నేత రామ‌కృష్ణ‌... అలియాస్ ఆర్కేదే అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. వారం క్రితం బ‌లిమెల‌లో జ‌రిగిన భారీ ఎన్‌కౌంట‌ర్లో 30 మంది మావోలు మృతి చెందిన సంఘ‌ట‌న తెలిసిందే. 
 
అయితే, అప్ప‌టి నుంచి ఆర్కే క‌నిపించ‌డం లేదు. వార్ అగ్ర‌నేత ఆచూకి కోసం ప్ర‌జా సంఘాల వారు రంగంలోకి దిగారు. మ‌రోప‌క్క ఆర్కే భార్య హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. త‌న భ‌ర్త పోలీసుల అదుపులో ఉన్నాడ‌ని, ఆయ‌న్ని చంపేసి ఉంటార‌ని అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ పిటిష‌న్ హైకోర్టు సీరియ‌స్‌గా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న నేప‌థ్యంలో ఇపుడు మ‌రో మావోయిస్టు మృతదేహం బ‌లిమెల‌లో దొర‌క‌డం గమనార్హం‌. ఇది ఆర్కేదేనా అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. అయితే, దీనిని ఆర్కే బంధువులు, పోలీసులు ధృవీక‌రించాల్సి ఉంది.

వెబ్దునియా పై చదవండి