ప్రతి ట్రిపుల్‌ ఐటీలో ఒక స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌.. జగన్‌

శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (18:55 IST)
ప్రతి ట్రిపుల్‌ ఐటీలో ఒక స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ పెట్టడం జరుగుతుందని  ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ మధ్యాహ్నం ఎచ్చెర్ల నియోజకవర్గంలోని, ఎస్‌.ఎం.పురంలోని ట్రిపుల్‌ ఐటీని సందర్శించారు.

అక్కడి తరగతి గదులు, హాస్టల్‌ బ్లాక్‌లను ప్రారంభించిన సీఎం, ఆ తర్వాత విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. 
 
ముఖ్యమంత్రి వైయస్‌ జగన్, ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల మధ్య సంభాషణ... యథాతథంగా:
 
‘ఈ ట్రిపుల్‌ ఐటీలో నాలుగో సంవత్సరం విద్యార్థులు కూడా ఉన్నారు. అంటే కనీసం ఇక్కడ 4 వేల మంది విద్యార్థులు ఉండాలి. కానీ కేవలం 1500 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. వారిలోనూ 500 మంది పక్కన ఇంజనీరింగ్‌ కళాశాలలో చదువుతున్నారు. నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో 2 వేల మంది విద్యార్థులు ఉన్నారని కేసీ రెడ్డి అన్న చెప్పారు.

బిల్డింగ్‌ పూర్తి కావాల్సి ఉంది. ల్యాబ్‌ సౌకర్యాలు కూడా లేవు. మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో టెక్నాలజీ స్కూళ్లు రావాలని, అక్కడ చదువుకునే విద్యార్థులను మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దాలని, ఇది జరగాలంటే గ్రామీణ స్థాయిలో మంచి యూనివర్సిటీ రావాలని, ఒక టెక్నికల్‌ సంస్థ ఏర్పాటు కావాలని భావించి ఆనాడు నాన్నగారు ఈ ట్రిపుల్‌ ఐటీలను స్థాపించడం జరిగింది.

దాని తర్వాత నాన్న చనిపోవడం, ఆ తర్వాత ఇంత మంచి కాలేజీల మధ్య చూపాల్సిన శ్రద్ధ ఈ పాలకులకు తగ్గుతూ వచ్చింది. ఆరోజుల్లో నాన్నగారు అనుకోగానే నూజివీడులోనూ, ఇడుపులపాయలోనూ టపాటపా కాలేజీలు ఏర్పాటయ్యాయి. కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత గత 5 సంవత్సరాలుగా చూస్తే పరిస్థితి ఎలా ఉందంటే, 5 సంవత్సరాలు అయినా కూడా కాలేజీలు ముందడుగు వేయలేదు.

పైగా కాలేజీలకు సంబంధించిన నిధులు దాదాపు రూ.185 కోట్లు పక్కదారి పట్టాయి. దీంతో కాలేజీలు, యూనివర్సిటీలు కొలాప్స్‌ అయ్యే పరిస్థితి వచ్చింది. అందుకే పరిస్థితిని మార్చడంపై దష్టి పెట్టాం. ఇక్కడ కేసీ రెడ్డి అన్నకు బాధ్యతలు అప్పగించాం. 100 రోజులు కూడా తిరక్క ముందే నేను స్వయంగా వచ్చాను. కాలేజీ పరిస్థితి మారుతుందని చెప్పడం కోసం నేను ఇక్కడికి స్వయంగా వచ్చాను.
 
విద్యార్థులతో ముఖాముఖి:
టి.హారిక, విశాఖపట్నం: ఐటీ కంపెనీలు వస్తేనే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఆ దిశలో మీ ప్రభుత్వం ఏం చేయబోతోంది?
ముఖ్యమంత్రి: రాష్ట్రం విడిపోయినప్పుడు ఎలాంటి మౌలిక వసతులు లేవు. నిజానికి విభజన నాటికి 98 శాతం ఐటీ రంగం మనకు లేకుండా పోయింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఐటీ రంగంలో మనకు దక్కింది కేవలం 2 శాతమే. మనకు చెన్నై, బెంగళూరు తరహాలో టైర్‌–1 వంటి నగరం లేదు. అంతో ఇంతో ఆ అవకాశం కేవలం విశాఖకు మాత్రమే ఉంది. అది నేను పూర్తిగా నమ్ముతున్నాను. అందుకే ఆ దిశలో కొన్ని చర్యలు చేపడతాము. ఐటీ రంగానికి స్కిల్‌ పర్సన్స్‌ ఇవ్వగలిగేది కేవలం ట్రిపుల్‌ ఐటీలు మాత్రమే. అందుకే ఈ సంస్థలలో పరిస్థితి పూర్తిగా మార్చి, విద్యార్థుల టాలెంట్‌ అందరూ గుర్తించేలా చేస్తామని కచ్చితంగా చెబుతున్నాను.
 
 
ఎండి.రైసాబాను, రాజమండ్రి: నా తండ్రి ఒక ఆటో డ్రైవర్‌. మీ వల్ల నేను ఇక్కడ చదువుకోగలుగుతున్నాను. అందుకు సంతోషంగా ఉంది. పరిశ్రమలకు అవసరమైన విధంగా మీరు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అవి మాకు ఏ విధంగా ఉపయోగపడతాయి?
 
ముఖ్యమంత్రి: పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇచ్చేలా ఒక చట్టం కూడా చేశాము. పరిశ్రమలు ఎప్పుడూ టాలెంట్‌ కోరుకుంటాయి. నాకు చాలా నమ్మకం ఉంది, తగిన మౌలిక వసతులు కల్పించి, శిక్షణనిస్తే ఈ పిల్లలు రాణించగలరు. అందుకే పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని, ఒక మంచి కాలేజీని ఎంపిక చేసి అక్కడ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ప్రారంభిస్తాము. అది ఒక ఇన్‌క్యుబేషన్‌ సెంటర్‌గా కూడా పని చేస్తాయి. లోకల్‌గా ఏయే పరిశ్రమలు ఉన్నాయి? వాటిలో అవసరాలు ఏమిటి? అని కలెక్టర్లు బేరీజు వేస్తారు. లోకల్‌గా ఉన్న ఇండస్ట్రీ, ఫ్యాక్టరీలు ఏవైతే ఉంటాయో, వాళ్లందరితో కూడా ఇంటరాక్ట్‌ అయి, వాళ్ల యాజమాన్యాల సైడ్‌ నుంచి వాళ్లను కూడా తీసుకువచ్చి, వాళ్లకు కావాల్సిన రిక్వైర్‌మెంట్స్‌ ఏమిటి అని చెప్పి అవగాహన తీసుకుంటారు. 
ఎవరైతే ఫ్యాక్టరీ పెట్టాలని చెప్పి అనుకుంటారో, ఆ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసే రోజే ఫలానా క్వాలిఫికేషన్స్‌ మాకు కావాలి అని చెప్పి రిక్వైర్‌మెంట్‌ వాళ్లు ఇవ్వడం జరుగుతుంది. కలెక్టర్లు ఆ రిక్వైర్‌మెంట్‌ రిక్వెస్ట్‌ను కలెక్ట్‌ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత ఆ కలెక్టర్లు ఆ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులతో ఇంటరాక్ట్‌ అయి మన పిల్లలు ఎవరైతే ఉన్నారో, వాళ్ల క్వాలిఫికేషన్స్‌ను అప్‌గ్రేడ్‌ చేసే కార్యక్రమం మన కలెక్టర్లు దగ్గరుండి ఈ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ఉపయోగించుకుని చేస్తారు. ప్రతి కాలేజీకి ఈ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఇవ్వడం వల్ల ఆ కాలేజీకి కూడా సపోర్ట్‌ ఇస్తాం. ఫండ్స్‌ ఇస్తాం. ఫండ్స్‌ ఇచ్చి ఆ కాలేజీకి కూడా సపోర్ట్‌ చేస్తాం. ఆ కాలేజీలో స్టాఫ్, ఫెసిలిటీస్‌ అప్‌గ్రేడ్‌ అయ్యే పరిస్థితి, అన్నీ కూడా దాని వల్ల జరుగుతాయి. 
ఇక్కడ ట్రిపుల్‌ ఐటీకి మాత్రం సెపరేట్‌గా ఇంకొక కార్యక్రమం కూడా చేస్తాం. కచ్చితంగా ప్రతి ట్రిపుల్‌ ఐటీలో ఒక స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ పెట్టడమే కాకుండా, ఆ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లను ఒక స్టెప్‌ ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. ఆ ముందుకు తీసుకుపోయే స్టెప్‌ ఏమిటి అంటే.. దీన్ని స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటరే కాకుండా ఇన్‌క్యుబేషన్‌ సెంటర్‌గా కూడా మార్చే కార్యక్రమం చేస్తాం. ఎప్పుడైతే దీన్ని స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌గా మాత్రమే కాకుండా, ఇన్‌క్యుబేషన్‌ సెంటర్‌గా మారుస్తామో.. అప్పుడు నాకు నమ్మకం ఉంది.. కేసీ రెడ్డి అన్న, రాజిరెడ్డి అన్న ఇటువంటి వ్యక్తులు అంతా కూడా, ఎవరైతే ఈ ట్రిపుల్‌ ఐటీలు స్థాపించే విషయంలో ముందడుగు వేశారో.. వాళ్లంతా కూడా ఇంకా యాక్టివ్‌ పార్ట్‌ తీసుకుంటే ఈ ఇన్‌క్యుబేషన్‌ సెంటర్లలోనే ఇన్ఫోసిస్, టీసీఎస్‌ వంటి కంపెనీలు కూడా వచ్చి, వాళ్లు కూడా పార్టిసిపేట్‌ చేసి, వాళ్ల రిక్వైర్‌మెంట్స్‌ ఈ జిల్లాకు మాత్రమే కాకుండా, ఈ దేశానికి సంబంధించిన రిక్వైర్‌మెంట్స్‌ కూడా ఇక్కడి నుంచే వస్తాయన్న నమ్మకం నాకుంది. కాబట్టి ఇక్కడ మాత్రం స్థాపించే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లను ఇన్‌క్యుబేషన్‌ సెంటర్లుగా మార్చి చేసి ఫండింగ్‌ ఎక్కువగా అలకేట్‌ చేస్తూ, ఇక్కడున్నటువంటి స్కిల్‌ను ఇంకా బ్రాడర్‌గా డెవలప్‌ చేసేందుకు ఎక్కువ ప్రయత్నం చేస్తాను.
 
కె.పవన్‌కుమార్, పులివెందుల:  మాకు 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మీరు పాదయాత్రలో హామీ ఇచ్చారు. కానీ గత ప్రభుత్వ వైఫల్యం వల్ల ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి. నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం మీరేం చేయబోతున్నారు?
 
ముఖ్యమంత్రి: మనం వేసే ప్రతి అడుగు కూడా అదే డైరెక్షన్‌లో ఉండాలి. నిజానికి నిరుద్యోగ సమస్యను పూర్తిగా పరిష్కరించడం అనేది బహుశా ఎవరి వల్లా సాధ్యం కాదేమో. కానీ సమస్యను తగ్గించగలుగుతాము. 
మనం వేసే ప్రతీ అడుగు కూడా అదే డైరెక్షన్‌లో ఉండాలి. ఇన్‌ ఫాక్ట్‌ నిరుద్యోగాన్ని ఒకేసాకి తీసేయడం అన్నది , పూర్తిగా ఎరాడికేట్‌ చేయడం అన్నది బహుశా ఎవరి చేత కాదేమో. కానీ తగ్గించగలుగుతాం. ఆ దిశగా అడుగులు  కరెస్టుగా వేయగలిగితే డెఫినిట్లీ మన పిల్లకు ఇంకా మెరుగైన అవకాశాలు ఇవ్వగలుగుతామన్న నమ్మకం నాకుంది. మనం చేయగలిగిన కార్యక్రమాలకే మనం నాంది  పలికాం. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతీ గ్రామంలోనూ, రెండువేల జనాభా నివాసం ఉన్న ప్రతీ గ్రామంలోనూ, ప్రతీ ఊరులోనూ గ్రామ సెక్రటేరియట్‌ తీసుకొచ్చాం. దాంట్లో  పదిమందికి ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమాలు చేశాం. అక్షరాలా లక్షా నలభై వేల ఉద్యోగాలు, గవర్నమెంట్‌ ఉద్యోగాలే గ్రామ సెక్రటేరియట్‌ ద్వారా ఈరోజు రిక్రూట్‌మెంట్‌ జరుగుతున్నాయి. అదికాక ఇంకా కాస్తా ఒక్క అడుగుముందుకు వేస్తూ... గవర్నెర్స్‌ను ప్రతీ ఇంటి దగ్గరికీ తీసుకుని  వెళ్లాలి. కరెక్షన్‌ అనేది లేకుండా,  పక్షపాతమనేది లేకుండా అర్హుడైన ప్రతీ ఒక్కరికీ మంచి  జరిగే విధంగా కార్యక్రమం జరగాలి అనే ఉద్దేశంతో గవర్నెన్స్‌ను ఇంకా ఒక అడుగు ముందుకు వేస్తూ.. గ్రామ వాలంటీర్లు అని చెప్పి  ప్రతీ యాభై ఇళ్లకు ఒక మనిషికి ఒక ఉద్యోగమిచ్చి, వాళ్లు కూడా కరెప్ట్‌ కాకుండా ఉండేందుకు ఐదువేల రూపాయలు హానరోరియంగా ఇస్తూ వాళ్ల ద్వారా గవర్నెమెంటుకి సంబంధించిన ప్రతీ ప«థకమూ డోర్‌ డెలివరీ చేసేట్టుగా పక్షపాతానికి తావులేకుండా గవర్నెన్స్‌ను దగ్గరికి  తీసుకపోయే కార్యక్రమానికి  శ్రీకారం చుట్టాం. దీని వల్ల మరో రెండు లక్షల డెబ్భై వేల  ఉద్యోగాలు మళ్లీ ఇవ్వగలిగాం. అన్ని కలిపి  ఈమూడు నెలల్లోనే నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్పడానికి గర్వపడుతూనే ఉన్నాం.  కానీ ఒకవైపున  ఈప్రయత్నాలు అన్నీ జరుగుతా ∙ఉన్నాక అన్నిటికన్నా విప్లవాత్మకమైన నిర్ణయం ఏమిటంటే మన పిల్లల మీద నాకు నమ్మకముంచి 75 శాతం రిజర్వేషన్లు తీసుకొస్తూ ఏకంగా ఒక చట్టాన్నే తీసుకునిరావడం.  ఇది బహుశా దేశ చరిత్రలో ఎక్కడా జరగలే.. ఆంధ్ర రాష్ట్రం  మొట్టమెదటిసారిగా ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ఎందుకనంటే ఇక్కడి  పరిస్ధితులు అలా ఉన్నాయి. డిగ్రీ  అయిపోయిన తర్వాత ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళ్లాలో అర్ధం కాని పరిస్ధితుల్లో మన పిల్లలు ఉన్నారు. టైర్‌ వన్‌ సిటీస్‌ హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రదేశాలు మనకు లేవు. కాబట్టి  వీటన్నింటిని అధిగమించాలంటే మన పిల్లలను కచ్చితంగా ఇక్కడికే ఎవరైనా కూడా పరిశ్రమలు పెట్టడానికి వచ్చినప్పుడు వాళ్లకిమన భూములు మనం ఇచ్చినప్పుడు కచ్చితంగా వాళ్లు మన పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వాలి అని అడగడంలో ధర్మముంది అని చెప్పి గట్టిగా నమ్మి మన పిల్లలు కోసం ఒక అడుగు ముందుకు వేశాం. ఈ అడుగు ముందుకు వేసినప్పుడు ఈ అడుగుతో పాటు ఛాలెంజెస్‌ కూడా ఉన్నాయి. నేను ఇంతకముందు చెప్పా..ఆ ఛాలెంజ్‌ మన క్వాలిఫికేషన్‌ క్రైటీరియాను మనం పెంచుకోవడం. మనకున్న స్కిల్స్‌ను అప్‌ గ్రేడ్‌ చేసుకోవడం. మన స్కిల్స్‌ అప్‌గ్రేడ్‌ చేసుకోవాలంటే మన క్వాలిఫికేషన్, మనం చదివే కోర్సులోంచి  రావాలి. మనం చదివే ప్రతీ కోర్సు కూడా జాబ్‌ ఓరియంటెడ్‌ కోర్సు కింద మారాలి. ఇంజనీరింగ్‌  కాలేజీలైతే నేమి, ట్రిపులైటీలైతేనేమి ఇటువంటి ఏ కాలేజీలైతేనేమి ఏ కోర్సులైతేనేమి అన్ని  కోర్సులు కూడా ఒక్కసారి రీ విజిట్‌ చేయాలి. రీ విజిట్‌ చేసేదానికి ఒక కమిటీని వేశాం. ఆ కమిటీలకు చెప్పిన మాండేట్‌ ఏమిటనీ అంటే ప్రతీ కోర్సు రీ విజిట్‌ చేయండి. ప్రతీ కోర్సూ జాబ్‌ ఓరియెంటెడ్‌ కోర్సుగా మార్చే కార్యక్రమం దిశగా అడుగులు వేయాలి అని చెప్పి మాండెట్‌ కూడా ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ సిఫార్సులన్నీ కూడా తీసుకుని, ప్రతీ కాలేజీ పరిధిలోని దాన్ని ఇంప్లిమెంట్‌ అయ్యేట్టుగా చేస్తాం. కాలేజీ పరిధిలో ఉన్న మన ట్రిపుల్‌ ఐటీనే కాకుండా మిగిలిన కాలేజీల్లో కూడా ఎడ్యుకేషన్‌ క్వాలిటీని మెరుగుపర్చడానికి ఏమం చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా చర్యలు తీసుకోవడానికి అడుగులు ముందుకు వేసేదానికి మొట్టమెదట సారిగా ఫీజు  రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌ అని చెప్పి హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కమిటీ కూడా ఒకటి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాం. వాటన్నింటినీ కూడా క్వాలిటీ ఆఫ్‌  ఎడ్యుకేషన్‌ పెంచేందుకు తీసుకొస్తావున్నాం. ఎప్పుడైతే క్వాలిటీ ఆఫ్‌ ఎఢ్యుకేషన్‌ వస్తుందో మన పిల్లలకు ఉద్యోగాలకు పోటీపడే అర్హతలు పెరుగుతాయి. దానికితోడు మన దగ్గర 75 శాతం లోకల్‌ రిజర్వేషన్‌ యాక్ట్‌ , చట్టం కూడా ఉంది కాబట్టి వీటన్నింటి వల్ల ఉద్యోగవకాశాలు మునపటికన్నా మెరుగవుతాయనే నమ్మకంతో ఉన్నాను. ఆ దిశగా అడుగులు ఖచ్చితంగా వేస్తామని చెప్తా ఉన్నాను.  ఖచ్చతంగా గవర్నమెంట్‌ తరపున ప్రతీ సంవత్సరం జనవరి ఫస్ట్‌ న ఖాలీగా ఉన్న ఉద్యోగాలకు సంబంధించి క్యాలెండర్‌ రిలీజ్‌ చేస్తాం. రెగ్యులర్‌ గా భర్తీ చేసే కార్యక్రమానికి  శ్రీకారం చుడతామని చెప్తా ఉన్నాం. 
 
పూర్ణిమా ప్రియాంక నాయుడు, విజయనగరం: ఇంజనీరింగ్‌ ఫస్ట్‌ ఇయర్, ఈసిఈ బ్రాంచ్, తండ్రి ప్రైవేటు కాంపొండర్‌. 
మీకు ధన్యవాదములు, ట్రిపుల్‌ ఐటీని స్ధాపించినందుకు. ఓ సామాజిక సమస్యను మీ ముందుంచుతున్నాం.  రాకెట్‌లు ప్రయోగించే సాంకేతక  యుగంలో ఉన్నాం. అయినా అంటరానితనం మాత్రం పోవడం లేదు. ఇటీవల శ్రీదేవి అనే మహిళా ఎమ్మెల్యే ఈ  సమస్యను ఎదుర్కొంది. సంఘంలో హోదా ఉన్న వారికే ఇలాంటి పరిస్ధితి ఎదురైతే సామాన్యుల పరిస్ధితి ఏంటి సార్‌. కులం ప్రకారం వివక్ష చూపించడం ఎంతవరకు కరెక్ట్‌ . ప్రభుత్వం ఇలాంటి సంఘటనలను రూపుమాపడానికిఎలాంటి  చర్యలు తీసుకుంటుంది. 
 
ముఖ్యమంత్రి: బాగా అడిగావు తల్లీ. నిజంగా మనందరం సిగ్గుపడాల్సిన విషయం. ఒక మహిళా ఎమ్మెల్యే కేవలం ఎస్సీగా ఉండటమే తాను చేసిన తప్పు అన్నట్టుగా వినాయక చవితికి ఆవిడను ఊరుకి అటెండ్‌ అయినప్పుడు, వినాయక చవితికి పాటిస్పేట్‌ చేయమని చెప్పి కొంతమంది అఢిగితే అక్కడికి పార్టిసిపేట్ చేయడానికి పోతే కొంతమంది తెలుగుదేశం పార్టీ సభ్యులు ఆ రకంగా ప్రవర్తించి ఆమెను దుర్భాషలాడి, ఆమెను కులం పేరుతో మైల పడుతుందని అని చెప్పడం చాలా తప్పు. వాళ్లా రకంగా అనకూడదు. ఆ రకంగా అన్నవాళ్లను ఆ పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలి. మెసేజ్‌ పంపించాలి. కానీ ఆయనా ఆ పని చేయలేదు. ఈ వ్యవస్ధ మార్పు రావాలి. మార్పు రావాలనే ఉద్దేశ్యంతోనే ఉన్నాం. నేను గర్వంగా  చెప్పగలను. మన గవర్నమెంట్‌ లో హోం మినిష్టర్‌ ఎవరూ అని అంటే ఎస్సీ  కులానికి చెందిన ఒక మహిళా అని చెప్పి నేను గర్వంగా చెపుతున్నా. కచ్చితంగా యాక్షన్‌ అనేది సివియర్‌ గానే తీసుకుంటాం. పోలీసులుకు కూడా కచ్చితంగా ఆదేశాలు ఇస్తాం. ఇటువంటివి ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా పునరావత్తం  కాకూడని  గట్టిగా నేను నమ్ముతూ ఉన్నాను. వుయ్‌ విల్‌  టేక్‌ ఆల్‌ సెరై్టనా యాక్షన్‌.
 
సంధ్య, కష్ణా జిల్లా: సార్‌ మీ వంద రోజుల పాలనపై ప్రజలు చాలా సంతప్తిగా ఉన్నారు. అనుమానం లేదు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్‌ కు  మీరే ఫర్‌ఫెక్ట్‌ సిఎం. ఏ సంఘటనలు మిమ్మల్ని అమ్మఒడి పధకం అమలు చేయడానికి స్ఫూర్తినిచ్చాయి. మీరు మాకు ఐకాన్‌ మరి మీకు ఎవరు స్ఫూర్తి ఈపేద ప్రజలకు సేవచేయడానికి. 
 
ముఖ్యమంత్రి: సంధ్యమ్మ చక్కగా అడిగావు  తల్లి. ఈరోజు నా త్రూ అవుట్‌ పాదయాత్రనే కాకుండా పదేళ్ల నా ప్రతిపక్షనేతగా ఉన్న సమయం కూడా, బహుశా నేను తిరిగినట్టుగా కొద్దిమంది పొలిటీషిన్స్‌ మాత్రమే తిరిగుంటారు. కానీ నేను చాలా పేదవాళ్ల ఇళ్లకు  పోయాను, ఓదార్పు యాత్ర అయితేనేమి, తర్వాత పాదయాత్రలో కూడా , ఈపదేళ్లలో నేను చాలా చూశాను. చదివించాలన్న ఆరాటం తల్లులకు  ఉంది. కాని చదివించలేని పరిస్ధితి, స్టోమత లేని వాళ్లున్న పరిస్ధితి  ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. మనమేదైనా మన తర్వాత తరాల వారికి ఇవ్వవలసిన ఆస్తి ఏదైనా ఉందంటే అది చదువు ఒక్కటే. ఈ చదువు అన్నది మనం ఇవ్వగలిగితేనే ఒక పేదవాడు  బిపిఎల్‌ నుంచి ఎపిఎల్‌ కు పోగలగుతాడు. ఒక పేదవాడు తన స్ధితిగతులు మార్చుకోవాలి, మారాలి అని అంటే ఆకుటుంబం నుంచి ఒక్కడన్నా  పెద్ద చదువులు చదవాలి. ఒక డాక్టర్‌ కావాలి. ఒక ఇంజనీర్‌ కావాలి. కలెక్టర్‌ వంటి పెద్ద, పెద్ద చదవులు చదవాలి. అలా చదవగలిగితే బయటకు వెళ్లి జీతాలు కాస్తా ఎక్కువగా సంపాదిస్తే... కాస్తా కూస్తో ఇంటికి పంపించగలుగుతాడు. తాను తన పిల్లలను నెక్ట్స్‌ లెవెల్‌ కు తీసుకుపోయే పరిస్ధితి వస్తుంది. దీనిని నేను గట్టిగా నమ్మాను. ఎందుకంటే నా కళ్లతో జరిగేదంతా చూశాను. కాబట్టి  ఇది మార్చాలి అని అంటే కచ్చితంగా ఈ వ్యవస్ధ అంతా పూర్తిగా మారాలి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 2011 జనాభా లెక్కలు ప్రకారం మన రాష్ట్రంలో నిరక్షరాస్యత రేటు 33 శాతం. 33 శాతం మంది చదువురాని వాళ్లు మన రాష్ట్రంలో ఉన్నారు. దేశం ఏవరేజ్‌కి  ఎంతా అని చూస్తే ... దేశం యావరేజ్‌ 27 శాతం. అంటే దేశం కన్నా మనం అన్యాయంగా ఉన్నాం. నేషనల్‌ యావరేజ్‌ కంటే తక్కువగా ఉన్నాం. అంటే చదివించాలని ఉన్నా మొట్టమొదట కాల్‌.. కడుపుకు, పిల్లలెవౖరినైనాన కూడా తల్లులెవరినైనా కూడా చదివించకూడదనుకోదు. కడుపులో అన్నానికి  ఫస్ట్‌ కాల్‌ వస్తుంది. .కడుపులో అన్నం పడితే దాని తర్వాత వచ్చే ఆలోచన చదువు. మన రాష్ట్రంలో ఉన్న పరిస్ధితి అది కాబట్టి ఈ పరిస్ధితి పోవాలని అంటే , దాన్ని మార్చాలనే  ఉద్దేశ్యంతోనే ఈ 33 శాతాన్ని జీరో పర్సెంట్‌ కి తీసుకురావాలని చెప్పి ముందడుగు వేశాం. ఇది జరగాలని అంటే ఫస్ట్‌ కాల్‌ కడుపు అన్నదాన్ని అడ్రెస్‌ చేయాలి. దాన్ని అడ్రెస్‌ చేయాలని అంటే ఆ తల్లిని మోటివేట్‌ చేయాలి. అది జరగాలని అంటే పిల్లలను కేవలం బడులకు  పంపిస్తే చాలు...  దాన్ని పండగ చేస్తాం. ప్రతీ యేడాదీ ప్రతీ తల్లికి పదిహేను వేల రూపాయులు కేవలం ఆ తల్లులు పిల్లలను బడులకు పంపిస్తే చాలు ఇస్తామని చెప్పి, తల్లులను మోటివేట్‌ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రెండవ ఏరియా ఏదైనా ఉంది అంటే అది 18 సంవత్సరాల  నుంచి 23 సంవత్సరాల  వయస్సు. ఈ వయస్సులో ఎంతమంది పిల్లలు కాలేజీల్లో ఎన్‌ రోల్‌ అవుతున్నారనే లెక్కలు చూస్తే. .. దాన్ని గ్రాస్‌ ఎన్‌ రోల్‌ మెంట్‌ రేషియో అంటారు. ఇది మనం ఎప్పుడూ కూడా బ్రిక్స్‌ దేశాలతో మనం కంపేర్‌ చేసుకుంటూ ఉంటాం. బ్రిక్స్‌ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్‌ ఆఫ్రికా... ఈదేశాలతో మనం కంపేర్‌ చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఇవి సిమిలర్‌ ఎకానమీ ఉన్న దేశాలు. కానీ బ్రిక్స్‌ దేశాల్లో కూడా జీఈఆర్‌ రేషియో అంటే ఎంత మంది పిల్లలు 18 నుంచి 23 వయస్సులో ఉన్న పిల్లలు ఎంతమంది కాలేజీల్లో చేరుతున్నారని చూస్తే..  రష్యాలో 81 శాతం పిల్లలు , చైనా 48 శాతం బ్రెజిల్‌ 50శాతం కానీ మన దేశం వచ్చేసరికి ఆ సంఖ్య 26 శాతం ఉంది. అంటే 74 శాతం మంది పిల్లలు కాలేజీలు, ఇంజనీరింగ్‌ కాలేజీలు వంటి చదవులు చదివే స్తోమత లేక డ్రాప్‌ అవుట్‌ అవుతున్నారు. దీన్ని మార్చాలి అంటే ఈ 81 శాతం ఉన్న రష్యాను కూడా అధిగమించాలంటే ఆంధ్రరాష్ట్రం ముందడుగు వేయాలి. అందుకే ఫస్ట్‌ టైం మనం నూటికి నూరుశాతం  ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ను తీసుకొస్తా ఉన్నాం. ఉట్టి నూరు శాతం ఫీజు రీ ఎంబర్స్‌మెంట్‌ సరిపోదన్న ఉద్దేశ్యంతో  ఆ పిల్లలకు  బోర్డింగ్‌ అండ్‌ లాడ్జింగ్‌లో  కూడా సంవత్సరానికి 20 వేల రూపాయలు సాయం చేసే దిశగా అఢుగులు వేస్తూ స్కీంను ఎన్‌హేన్స్‌ చేశాం. నాకు గట్టి నమ్మకముంది... ఈ 81 శాతం రష్యా శాతాన్ని కూడా దాటగలగుతామని  నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది. సో ఇవన్నీ కూడా నాకు రోల్‌ మోడల్‌ ఎవరు, స్ఫూర్తి ఎవరూ అని అంటే అది ఆ దివంగత నేత, ప్రియతమ నాయకుడు ఆ రాజశేఖర్‌ రెడ్డిగారు అని గర్వంగా చెపుతా ఉన్నా. మంచి ప్రశ్నలు అడిగారు . సమాధానాలు చెప్పాను. కాలేజీకి సంబంధించి,  మౌలిక  సదుపాయాలకు సంబధించి నాకు పూర్తి అవగాహన ఉంది. నేనిక్కడకు వచ్చి మీటింగ్‌ లో మాట్లాడటానికి గల కారణం ఏంటంటే .. .కాలేజీలను నేను వదిలేయడం లేదు, కాలేజీలను నేను పట్టించుకుంటున్నాను అని మెసేజ్‌ ఇవ్వడం కోసమే నేను ఇక్కడకి వచ్చాను. రాబోయే రోజుల్లో విపరీతంగా మార్పులు కనిపిస్తాయి. బిల్డింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్టర్‌ సూపర్‌ గా కట్టడం జరుగుతుంది. రిక్రూట్‌ మెంట్‌లు, టీచర్ల రిక్రూట్‌ మెంట్‌ ఫాస్ట్‌గా జరుగుతాయి. కాలేజీల్లో కూడా మళ్లీ బ్రహ్మండంగా తీర్చిదిద్దే కార్యక్రమం జరుగుతుందని  మరోక్కసారి మీ అందరికీ మాటిస్తూ... మీ అందరికీ భరోసా ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు