కేసీఆర్ సర్కార్ 2ఏళ్లలో కూలిపోద్ది.. సొంతపార్టీ నేతలు దద్దమ్మలు!

మంగళవారం, 21 అక్టోబరు 2014 (18:40 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణలో కేసీఆర్ సర్కారు రెండేళ్లకు మించి కొనసాగదని పాల్వాయి జోస్యం చెప్పారు. కేసీఆర్‌పై మంత్రులు, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కేడర్ అసంతృప్తితో ఉన్నారన్నారు. 
 
అసమ్మతి వల్ల కేసీఆర్ సర్కారు త్వరలోనే పడిపోయే అవకాశం ఉందని పాల్వాయి గోవర్ధన్ రెడ్డి జోస్యం చెప్పారు. టిఆర్ఎస్ సర్కారు పడిపోతే కాంగ్రెస్ ధీటుగా ఎదిగేలా పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని పాల్వాయి అభిప్రాయపడ్డారు.
 
తెలంగాణలో ప్రతిపక్ష పాత్ర పోషించడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని సొంతపార్టీపైనా విమర్శలు గుప్పించారు. కమర్షియల్ లీడర్‌షిప్ కాదు.. ఎఫెక్టివ్ లీడర్‌షిప్ కావాలని హితవు పలికారు. సీఎల్పీ నేతగా జానారెడ్డిపై విఫలమయ్యారు. సిఎల్పీ బాధ్యతలను జీవన్ రెడ్డికి అప్పగించాలన్నారు.

వెబ్దునియా పై చదవండి