పిఠాపురంలో పవన్ టూర్ : 12 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన ఏపీ డీసీఎం

సెల్వి

గురువారం, 7 నవంబరు 2024 (19:17 IST)
Pawan kalyan
పిఠాపురంలో అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటుకు కేబినెట్‌ అమోదం తెలిపింది. పిఠాపురంలో 30పడకల ఆస్పత్రి నిర్మాణానికి ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్. పిఠాపురం అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటుకు క్యాబినెట్‌ అమోదం తెలపడం పట్ల స్థానిక నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో 12 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. ఈ భూమి రిజిస్ట్రేషన్ ను పవన్ తరఫున పౌరసరఫరాల కార్పొరేషన్ తోట సుధీర్ పూర్తి చేశారు. ఈ స్థలంలో త్వరలోనే ఇల్లు, క్యాంపు కార్యాలయం నిర్మించనున్నట్లు జనసేన వర్గాలు తెలిపారు.
 
ఇటీవల పిఠాపురంలో పర్యటించిన పవన్... పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి కోసం పాడా (పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ ఏజెన్సీ)ను ఏర్పాటు చేస్తామని పవన్ ప్రకటించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు