అమరావతి రైతు ఉద్యమం ఉద్ధృతం : పవన్ కళ్యాణ్

గురువారం, 9 జనవరి 2020 (12:13 IST)
రాజధాని అమరావతి కోసం రైతులు చేపట్టిన ఉద్యమం మరింతగా ఉధృతమయ్యే అవకాశం ఉందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. అయితే, ఈ ఉద్యమాన్ని ప్రభుత్వం పోలీసు తుపాకీని ఎక్కుపెట్టి అణిచివేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. 
 
రాజధానిని తరలింపునకు వ్యతిరేకంగా అమరావతి రైతులు గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్న విషయం తెల్సిందే. రైతులు స్వచ్ఛంధంగా చేపట్టిన ఈ ఉద్యమం ఇపుడు తీవ్రరూపం దాల్చింది. ముఖ్యంగా, రైతుల ఉద్యమానికి ఒక్క అధికార పార్టీ మినహా అన్ని రాజకీయ పార్టీలు సంపూర్ణ మద్దతును తెలిపి, ఉద్యమంలో రైతులతో కలిసి ముందుకు నడుస్తున్నాయి. అదేసమయంలో ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రభుత్వం పోలీసు పవర్‌ను ఉపయోగిస్తోంది. 
 
దీనిపై పవన్ కళ్యాణ్ ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. పోలీసు బలంతో రైతుల ఉద్యమాన్ని అణచి వేయాలని జగన్ సర్కారు ప్రయత్నిస్తోందని అరోపించారు. ఇటువంటి చర్యలతో ఉద్యమం హింసాత్మకంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. రైతుల నిర్బంధం, అరెస్టులతో ఉద్యమాన్ని అణగదొక్కాలని చూస్తే, ఉద్యమం ఉద్ధృతం అవుతుందన్న సంగతిని గుర్తు పెట్టుకోవాలన్నారు. ఉద్యమ అణచివేతలో భాగంగానే బుధవారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు