చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలి.. పవన్

గురువారం, 9 మార్చి 2023 (11:24 IST)
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బుధవారం డిమాండ్ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ  అధినేత ఈ డిమాండ్‌ను తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చారని ఉద్ఘాటించారు. 33 శాతం రిజర్వేషన్ల సాధనకు రాజకీయంగా నిరంతరం కృషి చేస్తానని పునరుద్ఘాటించారు. 
 
మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధిగా నిలబడేందుకు, సాధికారత సాధించేందుకు చట్టసభల్లో మహిళలకు సీట్ల సంఖ్య తప్పనిసరిగా పెరగాలని చెప్పారు. 
 
ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు నివాసం ఉంటారని నమ్ముతానని వెల్లడించారు. ఎక్కడ మహిళలు గౌరవించబడతారో, అక్కడ శాంతి, సంపదలు వర్ధిల్లుతాయని తాను ప్రగాఢంగా విశ్వసిస్తున్నానని పవన్ చెప్పారు. 
 
కానీ, సమాజం, ప్రభుత్వాలు స్త్రీల పూర్తి సాధికారతను సాధించడానికి వారు స్వేచ్ఛతో జీవించడానికి చాలా ఎక్కువ శ్రద్ధ వహించాలని పవన్ వెల్లడించారు. మహిళలపై అఘాయిత్యాలు లేని సమాజాన్ని నెలకొల్పేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పవన్ పిలుపు నిచ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు