దశాబ్దాల తరబడి అటు ప్రభుత్వాలకు, ఇటు న్యాయవ్యవస్థకు చిక్కుముడిలా నిలిచిన రామజన్మభూమి అయోధ్య భూవివాదంపై సుప్రీం కోర్టు శనివారం తుది తీర్పును వెలువరించింది. ఈ తీర్పుపై సినీ, రాజకీయ ప్రముఖులు తమ తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.
మరోవైపు, అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల విశ్వహిందూ పరిషత్ హర్షం వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా హిందువులు సంబరాలు చేసుకోవాల్సిన సందర్భమని వ్యాఖ్యానించింది. వీహెచ్‌పీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్ మీడియాతో తన ఆనందాన్ని పంచుకున్నారు.
'ఇది సంతోషకరమైన రోజు, 491 సంవత్సరాలు పోరాటం, యుద్ధాలు, త్యాగాల అనంతరం దక్కిన విజయం ఇది' అని వ్యాఖ్యానించారు. సత్యం, న్యాయం పక్షాన కోర్టు నిలిచిందన్నారు. 40 రోజులు, 200 గంటలపాటు సుప్రీంకోర్టు విచారణ కొనసాగించి ఇచ్చిన తీర్పు ప్రపంచ న్యాయస్థానాల తీర్పుల్లోనే గొప్పదన్నారు.