రెండో విడత వారాహి యాత్ర షెడ్యూల్.. జూలై 9న ఏలూరు నుంచి..

శనివారం, 1 జులై 2023 (18:58 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెండో విడత వారాహి యాత్రను జనసేన విడుదల చేసింది. రెండో విడత వారాహి యాత్రను ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వారాహి యాత్ర సాగనుంది. 
 
ఏలూరు నగరం నుంచి రెండో దశ వారాహి యాత్రను స్వయంగా పవన్ కల్యాణ్ ప్రారంభించనున్నారు. ఇప్పటికే పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర విజయవంతంగా ముగిసింది. మిగిలిన 24 నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు