తిరుమల శ్రీవారి ఆలయంలో అఖండ దీపం ఆగిపోయింది.. సరిగ్గా నైవేద్యాలు పెట్టడం లేదు. ఆలయంలో ఎన్నో రకాల అపచారాలు జరుగుతున్నాయని రకరకాల ప్రచారాలు కొంతమంది చేస్తున్నారు. కొంతమంది స్వార్థపరులు కావాలనే పనిగట్టుకుని ఈ దుష్ప్రచారం చేస్తున్నారు. కోట్లాదిమంది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి ఎవరూ ఆందోళనకు గురికావద్దు.
స్వయంగా పెద్దజియ్యంగార్ టిటిడి ఈఓకు ఒక లేఖ కూడా రాశారు. ఆలయంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించాలని..ప్రజా సంబంధాల అధికారి ద్వారా మీడియా ప్రకటన చేయాలని కూడా నిన్ననే పెద్దజియ్యంగార్ కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న హడావిడిగా పిఆర్ ఓ విభాగం మీడియాకు ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. మీడియా ముందు ఎప్పుడూ రాని పెద్దజియ్యంగార్ ఈరోజు మధ్యాహ్నం తిరుపతిలో మీడియా ముందుకు వచ్చి తిరుమలపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని పూర్తిగా ఖండించారు.