నాన్న నేనూ కలిసే ఉంటున్నాం.. ప్లీజ్.. మీడియా కెమెరాలు ఆపేయండి!

గురువారం, 24 జులై 2014 (12:27 IST)
1956 స్థానికత గురించి మాట్లాడేముందు మీడియా వారు తన కెమెరాలను ఆఫ్ చేయాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఎందుకంటే మా నాన్న నేను కలిసే ఉంటున్నామని స్థానికత విషయం గురించి మాట్లాడేటప్పుడు కేటీఆర్ తెలిపారు. మా ఇద్దరి మధ్య అపోహలకు తావు లేకుండా బ్యాలెన్స్‌డ్‌గా చెప్పటానికి ప్రయత్నిస్తా" అని కేటీఆర్ వెల్లడించారు.
 
బుధవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఎల్‌ఓ), యంగ్‌ ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ (వైఎఫ్‌ఎల్‌ఓ) సంయుక్తంగా ‘విజన్‌ ఫర్‌ తెలంగాణ' పేరిట నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆ విధంగా అన్నారు. స్థానికత అనేది ఫీజు రీ ఇంబర్స్‌మెంట్‌ గురించి వచ్చిందని తెలిపారు. 
 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని అయినా, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి అయినా ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచిందీ నిలుస్తున్నది హైదరాబాదేనని. రాష్ట్రాభివృద్ధికి ఇంధనం హైదరాబాద్‌ నగరమేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు. 
 
తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు పయనిస్తోందని, రాబోయే ఐదేళ్లలో హైదరాబాద్‌ కచ్చితంగా స్మార్ట్‌సిటీగా ఉంటుందని, నగరంలో మురికివాడలు అనేవి లేకుండా చేయాలన్నది కేసీఆర్‌ లక్ష్యమని కేటీఆర్ తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి