వెంకటేశ్ నంబర్ 2..! సరుకు హద్దులు దాటించడంలో నంబర్ వన్నే..!! ఎందులో?

బుధవారం, 29 జులై 2015 (08:00 IST)
పేరు వెంకటేశ్... కరుడుగట్టిన స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డికి అనుచరుడు.. ఎర్రచందనం సరుకును సరిహద్దులు దాటించడంలో మాత్రం నంబర్ వన్నే... అతగాడిని చిత్తూరు పోలీసులు ఒడిసి పట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. 
 
చిత్తూరు, కడప జిల్లాల్లో కార్యకలాపాలు సాగిస్తూ పెద్ద ఎత్తున ఎర్రచందనం దుంగలను దేశ సరిహద్దులు దాటించిన కందస్వామి వెంకటేశ్ అంతర్జాతీయ స్థాయి స్మగ్లర్‌గా ఎదిగాడు. ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ఆరితేరిన కొల్లం గంగిరెడ్డితో పాటు మరో ఎర్ర స్మగ్లర్ సాహుల్‌కు ఇతడు ప్రధాన అనుచరుడిగానూ కొనసాగాడు. ఇతడి కదలికలపై నిఘా వేసిన పోలీసులు, నిన్న చెన్నైలో అరెస్ట్ చేశారు. 
 
పోలీసుల నిఘా పెరగడంతో గుట్టుచప్పుడు కాకుండా దుబాయ్ చెక్కేసేందుకు ప్లాన్ చేసుకున్న కందస్వామి చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నాడు. అప్పటికే అక్కడ మాటు వేసిన చిత్తూరు జిల్లా పోలీసులు అతడికి అరదండాలేశారు. అనంతరం అతడిని తిరుపతి పరిధిలోని రేణిగుంట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇతడిపై చిత్తూరు, కడప జిల్లాల్లో 16 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.  

వెబ్దునియా పై చదవండి