పవన్ కళ్యాణ్ హటావో-పాలిటిక్స్ బచావో: పంటికింద రాయిలా..

బుధవారం, 17 డిశెంబరు 2014 (11:49 IST)
తెలంగాణలో పవన్ కల్యాణ్ పార్టీకి అంత క్రేజ్ లభిస్తుందో లేదో అనేది డౌట్‌గానే ఉంది. బొగ్గుల శ్రీనివాస్ అనే ఈయన ఒక పుస్తకం రాశారు. ఇతడే ప్రస్తుతం పవన్ కల్యాణ్‌కు పంటికింద రాయిలా మారినట్లున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. శ్రీనివాస్ రాసిన పుస్తకం పేరు పవన్ కళ్యాణ్ హటావో-పాలిటిక్స్ బచావో.
 
ఆయన ఎన్.టి.ఆర్.స్టేడియంలో పుస్తక ప్రదర్శనలో ఈ పుస్తకం కూడా పడుతున్నారట. దీనిపై ఆయనకు సందేహం వచ్చింది. పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి ప్రమాదం ఉందని, కనుక తనకు రక్షణ కల్పించాలని ఆయన హోమ్ మంత్రి నాయిని నరసింహారెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు.
 
దీనిపై హోం మంత్రి స్పందించారు. పుస్తక ప్రదర్శనకు పూర్తి బందోబస్తుతో పాటు రక్షణ కల్పిస్తామని ఆయన శ్రీనివాస్‌కు హామీ ఇచ్చారు. పోలీసు అధికారులకు ఈ మేరకు ఆదేశాలు కూడా ఇచ్చారు. దానికి ఈయన ధన్యవదాలు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి