వస్త్ర పరిశ్రమల ఉత్పాదక వ్యయాన్ని తగ్గించాలి : ప్రత్తిపాటి పుల్లారావు

శనివారం, 30 ఏప్రియల్ 2016 (15:54 IST)
వస్త్ర పరిశ్రమల ఉత్పాదక వ్యయాన్ని తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కోరారు. శనివారం గుంటూరు వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో పత్తి ఆధారిత వస్త్ర పరిశ్రమలపై సదస్సు జరిగింది. ఇందులో ఆయన పాల్గొని మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని గుర్తు చేశారు. 
 
ఇందులోభాగంగా, పరిశ్రమలకు ప్రోత్సాహ నిధుల కింద 246 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసిందని ఆయన గుర్తు చేశారు. అదేసమయంలో వస్త్ర పరిశ్రమల ఉత్పాదక వ్యయాన్ని తగ్గించాలని కోరారు. అధిక ఉత్పాదక వ్యయం వల్ల రైతులు, మిల్లర్లు నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

వెబ్దునియా పై చదవండి