గుంటూరు జిల్లాలో మొత్తం 32 క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేశామని, 5,190 మందికి వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. 14 రోజులు క్వారంటైన్ పూర్తి అయిన తర్వాత ఇంటికి పంపించాలని ప్రభుత్వ అధికారులపై ఒత్తిడిలు వస్తున్నాయని మంత్రి మోపిదేవి అన్నారు.
అయితే 28 రోజులు క్వారంటైన్‌లో ఉంచాలని ప్రభుత్వం జీవో విడుదల చేసిందన్నారు. 14 రోజులు క్వారంటైన్‌లో ఉన్నవారికి నెగిటీవ్ రిపోర్టు వచ్చి.. బయటకు వెళ్లిన తర్వాత వారికి మళ్లీ పాజిటీవ్ వచ్చే అవకాశం ఉందని, జాతీయ స్థాయిలో అక్కడక్కడ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు.