పీవీ సింధూ రియో ఒలిపింక్స్ క్రీడల్లో రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలు ఆమెకు నజరానాలు ప్రకటించాయి. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ఆమెకు గ్రూప్ వన్ ఆఫీసర్ ఉద్యోగాలు ఇస్తామని తెలిపాయి. ఇచ్చిన మాట ప్రకారం ఏపీ ప్రభుత్వం ఆమెకు డిప్యూటీ కలెక్టర్ పోస్టు ఇస్తున్నట్లు ప్రకటించగా, అందుకు ఆమె సమ్మతించారు.