చేపల కోసం వల వేస్తే కొండచిలువ పడింది

మంగళవారం, 11 ఆగస్టు 2020 (10:49 IST)
పుట్టెడు ఆశతో చేపలకు వెళ్లారు కొంతమంది యువకులు.. చాలా కాలం తర్వాత వేటకు వెళ్లడం వల్ల పట్టుకున్నన్ని చేపలు గ్యారెంటీ అనుకున్నారు. కానీ చేపల సంగతేమోగానీ.. వారికి భారీ కొండచిలువ పట్టుబడింది.
 
 మంగళవారం ఉదయం సమీపంలోని కొండవీటి వాగుకు వెళ్లిన గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెం గ్రామానికి చెందిన యువకులు ఇది చూసి ఒక్కసారిగా ఖంగుతిన్నారు.

చేపల కోసం వారు విసిరిన వలలో దాదాపు పది అడుగుల కొండ చిలువ పడింది. తొలుత చేప పడి ఉంటుందని భావించిన యువకులు నీటిలోనుంచి వలను బయటకు లాగగా  వలలో కొండచిలువ ప్రత్యక్షమైంది. అనంతరం వారు దానిని చంపేశారు. ఈ కొండ చిలువను చూడడానికి స్థానిక గ్రామస్తులు ఎగబడ్డారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు