డిసెంబరు 30న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
మంగళవారం, 29 డిశెంబరు 2020 (19:19 IST)
భక్తుల సౌకర్యార్థం జనవరి 4 నుండి 31వ తేదీ వరకు రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను డిసెంబరు 30న బుధవారం ఉదయం 9 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని కోరడమైనది.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబరు 25 నుండి జనవరి 3వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్న విషయం విదితమే. జనవరి 3వ తేదీ వరకు ఇదివరకే ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేయడం జరిగింది. ఈ కారణంగా జనవరి 4 నుంచి నెలాఖరు వరకు టిటిడి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను బుధవారం విడుదల చేయనుంది.
కాగా, జనవరిలో శ్రీవారి ఆలయంలో జరుగనున్న విశేష ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి...
- జనవరి 7న అధ్యయనోత్సవాలు సమాప్తి.
- జనవరి 8న తిరుమలనంబి సన్నిధికి శ్రీ మలయప్పస్వామివారు వేంచేపు.
- జనవరి 9, 24వ తేదీల్లో సర్వ ఏకాదశి.
- జనవరి 10న శ్రీ తొండరడిప్పొడియాళ్వార్ వర్షతిరునక్షత్రం.