ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇది రాజకీయ సభ కాదని, దగాపడిన రైతు సభ అని అన్నారు. రైతులకు మద్దతుగా అన్ని వర్గాల వారు తరలివస్తున్నారన్నారు. వంద శాతం అమరావతే రాజధానిగా ఉంటుందని, ఈ విషయంలో ఏ ఒక్కరూ ఆందోళన చెందనక్కర్లేదన్నారు.
నవ్యాంధ్రకు అమరావతే శాశ్వత రాజధాని, అడ్డుపడే మేఘాలు అశాశ్వతమని అన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ మంచివాడని తాను చెప్పనని, కానీ చెడ్డవాడు మాత్రం కాదని చెప్పారు. ఎవరో చెప్పమన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారని అన్నారు.
ఈ సభకు తనను ఆహ్వానించినందుక ధన్యవాదాలని చెబుతున్నామన్నారు. అయితే, అమరావతి నిర్మాణానికి, రాష్ట్రాభివృద్ధికి ఆటంకంకా ఉన్న బీజేపీతో తాము వేదికను పంచుకోలేమని చెప్పారు. సభకు రాలేకపోతున్నందుకు విచారం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు.