జూలై 3న బంగాళాఖాతంలో అల్పపీడనం

ఆదివారం, 26 జూన్ 2022 (10:44 IST)
బంగాళాఖాతంలో వచ్చే నెల మూడో తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం కారణంగా జూలై ఆరో తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు దేశ వ్యాప్తంగా విస్తరిస్తాయని పేర్కొంది. 
 
పడమర తీరంలోని దక్షిణ గుజరాత్ నుంచి కేరళ వరకు తీర ద్రోణి కొనసాగుతుంది. అక్కడ నుంచి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా మీదుగా తూర్పు పడమర ద్రోణి విస్తరించిందని, వీటి ప్రభావంతో అరేబియా సముద్రం నుంచి రుతపవన గాలులు వీస్తున్నట్టు తెలిపింది. 
 
ఫలితంగా ఈ నెలఖరు వరకు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇదిలావుంటే, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో శనివారం పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. వచ్చే 24 గంటల్లో కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు