అరేబియా మధ్య ప్రాంతం నుంచి కర్నాటక మీదుగా విదర్భ వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా, తెలుగు రాష్ట్రాల్లో రాగల 48 గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉపరితలానికి 900 మీటర్ల ఎత్తులో ఈ ద్రోణి కొనసాగుతోందని వెల్లడించారు.
దీని ప్రభావం తెలంగాణపై అధికంగా ఉంటుందని అంచనా వేశారు. ఇదే సమయంలో ఉత్తర కోస్తాంధ్ర, ప్రకాశం, గుంటూరు జిల్లాలపై ప్రభావం చూపుతుందని, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.