రాజమౌళి అమరావతి డిజైన్లను బాబు పక్కన పెట్టేశారా?

మంగళవారం, 24 అక్టోబరు 2017 (14:11 IST)
అమరావతి రాజధాని నిర్మాణం కోసం నార్మన్ ఫోస్టర్ సంస్థ అందించిన డిజైన్లపై సంతృప్తి లేక వాటికి తెలుగుదనం అద్దాలని దర్శకధీరుడు రాజమౌళి బృందాన్ని లండన్ నగరానికి పంపిన సంగతి తెలిసిందే. అక్కడ రాజమౌళి బృందం గత కొన్ని రోజులుగా డిజైన్లు పరిశీలిస్తోంది. అలాగే ఆ డిజైన్లకు జక్కన్న కొన్ని మార్పులుచేర్పులు సూచించినట్లు తెలుస్తోంది. ఐతే ఇప్పుడా మార్పులను చంద్రబాబు నాయుడు అంగీకరించలేదంటూ వార్తలు ప్రచారమవుతున్నాయి.
 
ఐతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఉదయమే లండన్ నగరానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. మరి ఇంతలోనే ఆయన రాజమౌళి ఎంపిక చేసిన డిజైన్లను పరిశీలించడం, వద్దని చెప్పడం జరిగిపోయిందా అనేది అనుమానమే... మొత్తమ్మీద వార్తలయితే ఇలా వ్యాపిస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు