ఇదిలా ఉండగా హైదరాబాద్ ప్రాంతంలో రేవ్ పార్టీ సంస్కృతి పెరిగిపోతోంది. ఈ నెల 7న ఓ ఫాంహౌస్ లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న రేవ్ పార్టీపై సైబారాబాద్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేసిన విషయం తెలిసిందే. రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో రేవ్ పార్టీలు జోరందుకుంటున్నాయి. విలాసాలకు అలవాటుపడిన యువత రేవ్ పార్టీల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. మత్తులో జోగుతున్నారు.