సంక్రాంతి సంబరాలు.. అడ్డూఅదుపు లేకుండా అర్థరాత్రి అశ్లీల నృత్యాలు

శనివారం, 14 జనవరి 2017 (08:57 IST)
గోదావరి జిల్లాలు పచ్చని అందాలకు పెట్టింది పేరు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు గోదావరి జిల్లాల్లో సందడి వాతావరణం మామూలుగా ఉండదు. ఒకవైపు సంక్రాంతి సంబరాలు.. మరోవైపు.. కోడింపదేల జోరు.. బెట్టింగ్‌ల హోరు. ఇంకోవైపు రికార్డింగ్ డ్యాన్సులు. వీటికితోడు ప్రత్యేకమైన పిండివంటకాలు. 
 
అయితే, పండుగ ఇంకా మూడు రోజులు ఉందనగానే కోడి పందెం మొదలుకుని వేరే ఊరు నుంచి మగువలను తెప్పించి రికార్డింగ్ డ్యాన్స్‌లు వేయించడం ఇవన్నీ షరామామూలుగా జరిగిపోతున్నాయి అయితే ఎందుకిలా చేస్తున్నారని ప్రజాప్రతినిధులు గానీ, పోలీసులుగానీ ప్రశ్నించిన పాపాన పోలేదు. పైగా ప్రజానిధులు, పోలీసులు దగ్గరుండి ఆ రికార్డింగ్ డ్యాన్స్‌ను ఎంజాయ్ చేస్తుండటం గమనార్హం. ఇదంతా నడిపిస్తున్నది బడాబాబులు, రాజకీయ నేతలే కావడం గమనార్హం. అందుకే పోలీసులు కూడా జోక్యం చేసుకోవాలంటే జంకుతున్నారు.
 
తూర్పుగోదావరి జిల్లాలోని మల్కిపురం మండలంలోని తూర్పుపాలెం, కేశనపల్లి, పడమటిపాలెం, గుడిమెళ్ళంక గ్రామాల్లో అడ్డుఅదుపు లేకుండా అర్థరాత్రి యధేచ్చగా అశ్లీల నృత్యాలు సాగుతున్నాయి. ప్రభుత్వం ఇలాంటి అశ్లీల నృత్యాలు జరపకుండా నిర్వహకులను కఠినంగా శిక్షించాలని పలువురు నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి