శ్రీవారి ఆలయంలో సంభావన అర్చకులుగా పనిచేస్తున్న మణికంఠాచార్యులు, మారుతి ప్రసాదాచార్యుల మధ్య గత కొన్నినెలలుగా విభేదాలు ఉన్నాయి. ఒకరంటే ఒకరికి పడదు. మణికంఠాచార్యులని ఉద్యోగం నుంచి ఎలాగైనా తీయించాలనుకున్నాడు మారుతి. కడపకు చెందిన కళ్యాణి, సరోజాలపై రెండు లక్షల బేరం కుదిరించుకుని మణికంఠాచార్యులను బలవంతం చేయండి అంటూ సలహా ఇచ్చాడు. విధులు ముగించుకుని తన గదికి వెళ్ళిన మణికంఠాచార్యులపైన ఇద్దరు మహిళలు బలవంతం పెట్టారు.