చెల్లెమ్మ రోజాకు జగనన్న కీలక పదవి.. (Video)

బుధవారం, 12 జూన్ 2019 (16:38 IST)
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకు తన చెల్లెమ్మ అని పిలుచుకునే నగరి వైసీపీ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజాకు కీలక పోస్టు ఇచ్చారు. రోజా ముందు మూడు సీఎం జగన్ మూడు ఆఫర్లు పెట్టినట్టు తెలుస్తోంది. 
 
ఏపీఐఐసీ, ఆర్టీసీ, మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్లలో ఏదో ఒకటి తీసుకోవాలని జగన్ సూచించగా.. ఆమె మీ ఇష్టం అంటూ నిర్ణయాన్ని సీఎం జగన్‌కే వదిలేసినట్టు తెలుస్తోంది. దీంతో రోజాను సీఎం జగన్.. ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా నియమించారు. తనకు కీలక పదవి అప్పగించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియాలో రోజా పోస్టు పెట్టారు. 
 
తొలి కేబినెట్‌లో అవకాశం దక్కకపోవడంతో అలకపాన్పు ఎక్కిన రోజాను బుజ్జగించిన సీఎం జగన్మోహన్ రెడ్డి.. రాష్ట్ర పరిశ్రమల మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (ఏపీఐఐసీ) ఛైర్ పర్సన్‌గా నియమించారు. దీంతో రోజా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. రోజాకు జగనన్న కీలక పదవి ఇచ్చారని కొనియాడుతున్నారు.
 
నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రి జగన్ ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో కొత్త సర్కారును ఏర్పాటు చేసిన తరుణంలో ఏపీలో పారిశ్రామిక అభివృద్ది కోసం తీసుకొనే నిర్ణయాల్లో కీల‌క భూమిక పోషించే ఏపీఐఐసీని రోజాకు జగన్ కట్టబెట్టారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు