బస్సుల్లో సీటింగ్ మార్పు, గ్రీన్ జోన్ల మధ్య తిప్పేందుకు ప్రణాళిక, రెడ్ జోన్లలో పాటించే నిబంధనలు, తక్కువ సీట్లతో తిప్పితే వచ్చే నష్టం, ప్రజలకు బస్సులు తిరగడం వల్ల కలిగే ఉపయోగం తదితర అంశాలపై చర్చించారు. పొరుగు రాష్ట్రం తెలంగాణ.. హైదరాబాద్ మినహా రాష్ట్రమంతా తిప్పేందుకు నిర్ణయం తీసుకొంది.
అదే తరహాలో మన రాష్ట్రంలోనూ పెద్దనగరాలైన విజయవాడ, విశాఖపట్నంలో మరికొన్ని రోజులు బస్సులు నడపరాదని నిర్ణయించారు. చార్జీల విషయంలో ప్రస్తుతానికి ఎలాంటి పెంపు లేకుండా పాత రేట్లతోనే నడపాలని సీఎం చెప్పడంతో అధికారులు సరేనన్నారు.
తెలంగాణ బస్సుల్లో జనం కరువు
దాదాపు రెండు నెలల తర్వాత తెలంగాణలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. కానీ.. కరోనా వైరస్ వ్యాప్తి భయాందోళనలు ఇంకా వెంటాడుతుండడం, ఎండలు, పూర్తిగా సడలని లాక్‌డౌన్ ఆంక్షల కారణంగా చాలా మంది బస్సుల్లో ప్రయాణించడానికి సాహసించలేదు.