గుంటూరులో శబరి ఎక్స్‌ప్రెస్‌లో తప్పిన పెను ప్రమాదం..

మంగళవారం, 1 నవంబరు 2022 (09:47 IST)
హైదరాబాద్ నుంచి తిరువనంతపురంకు వెళ్లే శబరి ఎక్స్‌ప్రెస్‌కు గుంటూరులో పెను ప్రమాదం తప్పింది. రైలు పట్టాలపై దుండగులు ఇనుప రాడ్డును ఉంచారు. నల్లపాడు - గుంటూరు సెక్షన్‌లో దండగులు ఈ పనికి పాల్పడ్డారు. అయితే, లోకో పైలట్ అప్రమత్తతో పెను ముప్పు తప్పింది. 
 
17230 అనే నంబరు కలిగిన రైలు హైదరాబాద్ - తిరువనంతపురం ప్రాంతాల మధ్య నడుస్తుంది. హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఈ రైలు సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో నల్లపాడు గుంటూరు సెక్షన్‌లో పరుగులు తీస్కుంది. 
 
ఈ క్రమంలో రైలు పట్టాలపై దుండుగులు కట్టిన ఇనుప రాడ్‌ను లోకో పైలట్ గుర్తించి, వెంటనే అప్రమత్తమై అత్యవసర బ్రేకులు వేశాడు. దీంతో రాడ్డు సమీపానికి వచ్చి రైలు ఆగిపోయింది. ఈ అనుపరాడ్డును లోకో పైలెట్ గుర్తించకుంటే శబరి ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం జరిగివుండేది. రైలును ఆపిన తర్వాత రైల్వే సిబ్బంది ఇనుపరాడ్డును తొలగించిన తర్వాత రైలు తిరిగి బయలుదేరింది. 
 
దుండగులు పొడవైన ఇను రాడ్డు పెట్టారు. రైలు వేగంగా ప్రయాణించే సమయంలో దాని అదురుకు ఆ ఇనుపరాడు కిందపడిపోకుండా ఉండేందుకు వీలుగా ఇనుపరాడ్డును గుడ్డతో కట్టారు. దుండగులు పథకం ప్రకారమే ఈ పని చేసివుంటారని రైల్వే సిబ్బంది అనుమానిస్తున్నారు. రైలు పట్టాలపై గస్తీ నిర్వహించే సిబ్బంది తనిఖీ చేసుకుంటూ వెళ్లిన తర్వాత దుండగులు ఈ పనికి పాల్పడివుంటారని భావిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు