బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు విజయ్ సాయిరెడ్డితో కలిసి కేంద్ర రైల్వే మంత్రి పీయూశ్ గొయల్ కు ఆయన కార్యాలయంలో ఒక వినతిపత్రాన్ని అందజేశారు. బిట్రగుంట లో 11 వందల ఎకరాలకు మించి రైల్వే స్థలం, ఎన్నో మౌలిక సౌకర్యాలు ఇప్పటికే ఉన్నాయని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు.
అలాగే ఈనెల 25వ తేదీన గూడూరు నుంచి విజయవాడ కు కొత్తగా ప్రవేశపెడుతున్న ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ను బిట్రగుంటలొ నిలుపుదల చేయాలని కోరారు. తద్వారా బిట్రగుంటకు న్యాయం జరుగుతుందని, జిల్లావాసులకు ఎన్నో ఉద్యోగాలు లభించడంతోపాటు స్థానిక యువతకు న్యాయం జరుగుతుందని తెలిపారు. రైల్వే పరిశ్రమ ఏర్పాటుతో జిల్లా అభివృద్ధికి కూడా అవకాశం లభిస్తుందని తెలిపారు.