పవన్ కళ్యాణ్‌ దెబ్బకు జడుసుకుంటున్న భాజపా... సిద్ధార్థనాథ్ సింగ్ అలా ఎందుకన్నారు...?

బుధవారం, 2 నవంబరు 2016 (12:02 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో చేతులు కలిపే ప్రసక్తే లేదని భార‌తీయ జ‌నతా పార్టీ ఏపీ వ్యవహారాల ఇంఛార్జ్ సిద్ధార్థ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో పవన్ త‌మ‌కు మ‌ద్ద‌తు మాత్ర‌మే తెలిపార‌ని, ఆయ‌న‌ స్థాపించిన జనసేన పార్టీతో తాము జ‌త‌క‌ట్ట‌లేద‌ని క్లారిఫై చేశారు. 
 
త‌మ పార్టీ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఈ నెల 26న ర్యాలీ నిర్వహించ‌నుంద‌ని, అందులో త‌మ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా పాల్గొంటారన్నారు. ఇటీవ‌ల జ‌రిగిన సిమీ ఉగ్ర‌వాదుల ఎన్‌కౌంట‌ర్ నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు చేసిన విమ‌ర్శ‌ల‌ను సిద్ధార్థ్నాథ్ సింగ్ తిప్పికొడుతూ ఆ పార్టీ ఉగ్ర‌వాదుల‌ను కాపాడుతోందని ఆరోపించారు.

వెబ్దునియా పై చదవండి