కేసీఆర్ చాంబర్‌కు స్మితా సబర్వాల్.. బాధ్యతలు స్వీకరింపు!

శుక్రవారం, 6 జూన్ 2014 (15:54 IST)
మెదక్ జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్‌ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. చిన్నవయసులోనే కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి రెండుసార్లు ఉత్తమ కలెక్టర్‌గా అవార్డులు అందుకున్నారు. తాజాగా ఈమె తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అదనపు కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.

స్మితా సబర్వాల్ శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు. అనంతరం ఆమె సీఎం అదనపు కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. కాగా స్మితా సబర్వాల్ భర్త అకున్ సబర్వాల్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని నేషనల్ పోలీస్ అకాడమీలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
 

వెబ్దునియా పై చదవండి