రాష్ట్రపతి నిలయంలో పాములు బాబోయ్..!. పాములు...!! 11 పాములను పట్టిన సిబ్బంది.

శనివారం, 4 జులై 2015 (06:19 IST)
దక్షిణాది రాష్ట్రాల విడిది కోసం వచ్చిన రాష్ట్రపతికి పాముల బెడద ఎక్కువైంది. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో పాముల సంచారం పెరిగింది. దీనిని గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే జూపార్కు సిబ్బంది సమాచారం అందించారు. 
 
వెంటనే అక్కడకు చేరుకున్న జూపార్కు సిబ్బంది పాములు పట్టుకుని జూపార్కుకు తరలించారు. మొత్తం 11 పాములను పట్టుకుని జూపార్కు తరలించారు. వీటిలో రెండు తాచుపాములు, ఒక కోబ్రా ఉన్నట్లు జూ అధికారులు తెలిపారు. 
 
కాగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహుడి సన్నిధిలో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పర్యటన ఈ నెల 5వ తేదీన గంటసేపు కొనసాగనుంది. రాష్ట్రపతి భద్రతా రీత్యా శనివారం రాత్రికే యాదగిరికొండను రాష్ట్రపతి భద్రతా సిబ్బంది తమ అధీనంలోకి తీసుకోనున్నారు. దీంతో శనివారం రాత్రి 9గంటల నుంచే కొండపైకి భక్తులను అనుమతించరు. 

వెబ్దునియా పై చదవండి