రెండేళ్లు సహజీవనం - ప్రియురాలి వదిలి వెళ్ళిందని ప్రియుడు ఆత్మహత్య

బుధవారం, 8 ఏప్రియల్ 2020 (16:28 IST)
హైదరాబాద్ నగరంలో విషాదం చోటుచేసుకుంది. రెండేళ్లు సహజీవనం చేసిన ప్రియురాలు వదిలి వెళ్లడాన్ని జీర్ణించుకోలేక ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో కేపీహెచ్‌బీ కాలనీలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, కేబీహెచ్‌బీ కాలనీకి చెందిన చంద్రకిరణ్‌ (32) అనే వ్యక్తి మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో పని చేస్తున్నాడు. అతనికి ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో రెండేళ్లుగా సహజీవనం చేస్తూవచ్చారు. 
 
ఈ క్రమంలో నెల రోజుల క్రితం చంద్రకిరణ్ బేగంపేటలో నివాసమున్నాడు. అయితే, ఇటీవల కేపీహెచ్‌బీ పరిధిలోని తులసినగర్‌లోని ఓ అపార్టుమెంట్‌లో గది తీసుకుని ఉంటున్నాడు. ఇటీవలే చంద్రకిరణ్‌ను వదిలి యువతి వెళ్లిపోవడంతో అతడు మనస్తాపానికి గురయ్యాడు.
 
ఈ నేపథ్యంలో ఆ అమ్మాయి లేనిదే తాను జీవించలేనని ఆత్మహత్య లేఖ రాసి గదిలోనే సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకొని చనిపోయాడు. చంద్రకిరణ్‌కి అతడి సోదరుడు ఫోన్‌ చేయగా అతడు ఎత్తకపోవడంతో అనుమానం వచ్చి గదికి వచ్చి చూసేసరికి ఫ్యానుకి వేలాడుతూ కనపడ్డాడు. ఈ ఘనటపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు