ఎక్స్ రే కోసం దుస్తులిప్పేయాలంటూ యువతిని వేధించిన వ్యక్తి... రిమ్స్‌లో ఘటన

సోమవారం, 30 నవంబరు 2015 (20:28 IST)
శ్రీకాకుళం జిల్లా రిమ్స్ ఆసుపత్రిలో ఎక్స్ రే విభాగంలో పనిచేస్తున్న వెంకటరమణ అనే ఉద్యోగి ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఎక్స్ రే కోసం వచ్చిన ఆమెను ఎక్స్ రే బాగా రావాలంటే దుస్తులు విప్పేయాలంటూ వేధించాడు. దాదాపు 45 నిమిషాల పాటు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. సమాచారం తెలుసుకున్న ఆసుపత్రి వర్గాలు అతడి ప్రవర్తనకు షాక్ తిన్నది. అతడి పైన నిర్భయ చట్టం ప్రయోగించాలని కోరింది.
 
మరోవైపు అతడు గతంలో కూడా కొంతమంది యువతులను ఇలాగే వేధించినట్లు వెల్లడైంది. ఐతే తను అమాయకుడిననీ, తనకేమీ తెలియదంటున్నాడు వెంకటరమణ. ఆమె ఎవరో తనకు తెలియదనీ, ఆమెతో పాటు ఆమె సోదరి కూడా వచ్చిందనీ, అలాంటప్పుడు తను ఆమె దుస్తులను విప్పేయాలని ఎలా అడుగుతానంటూ ప్రశ్నిస్తున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి