కెరమెరి ప్రాంత ఎస్ఐగా కె.శ్రీధర్ (27) పని చేస్తున్నారు. ఈయన సర్వీస్ రివాల్వర్ మిస్‌ఫైర్ కావడంతో ఆయన తలలోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఎస్సై శ్రీధర్ మృతి చెందాడు. శ్రీధర్ స్వస్థలం కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం అవునూరు గ్రామం. ఘటనపై విచారణ జరిపిన జిల్లా ఎస్పీ కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు... ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తుపాకి ప్రమాదవశాత్తు పేలిందా? లేక శ్రీధర్ ఆత్మహత్య చేసుకున్నాడా? అనే అంశం ఇంకా తేలలేదు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రెండు రోజుల క్రితమే శ్రీధర్ కెరమెరి ఎస్ఐగా బాధ్యతలు చేపట్టాడు. ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన రెండు రోజులకే ఈ ఘటన జరగడం కలకలం రేపుతోంది.