శివరామకృష్ణన్ కంటే నారాయణ గొప్పవారా : తమ్మినేని సీతారాం

మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (11:46 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వార్థ ప్రయోజనాల కోసమే శివరామకృష్ణన్ కమిటీని పక్కనబెట్టారని వైఎస్ఆర్ సీపీ నాయకుడు తమ్మినేని సీతారాం ఆరోపించారు. శివరామకృష్ణన్ కంటే ఏపీ పురపాలక శాఖామంత్రి నారాయణ గొప్పవారా అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టడం ఎంతవరకు సమంజసమన్నారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... ఎన్నికల్లో హవాలా నడిపిన మంత్రి నారాయణకు కార్పొరేట్ శక్తులకు లబ్ది చేకూర్చడమే లక్ష్యమా అని నిలదీశారు. రాజధాని ఎంపికలో నారాయణ కమిటీ నివేదిక ప్రజల్లో అనుమానాలకు దారితీసేలా ఉందని తప్పుబట్టారు. 60 అంతస్తుల భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేస్తే ఇన్ని వేల ఎకరాలు సేకరించడం ఎందుకని తమ్మినేని సీతారాం విమర్శించారు. 

వెబ్దునియా పై చదవండి