పగో జిల్లా జంగారెడ్డిగూడెంకు తెదేపా ఎమ్మెల్యేలు

సోమవారం, 21 మార్చి 2022 (15:52 IST)
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తాగి 27 మంది చనిపోయారు. ఈ మరణాలు రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి. ఈ కల్తీ సారా మరణాలపై ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ చర్చకు పట్టుబట్టింది. కానీ, ప్రభుత్వం మాత్రం అంగీకరించలేదు. 
 
అదేసమయంలో ప్రభుత్వ అధికారులు మాత్రం ఈ మరణాలను సాధారణ మరణాలుగా పేర్కొని, దర్యాప్తును ఆదేశించారు. అయితే, కల్తీసారా తాగే వారు ప్రాణాలు కోల్పోయారని, అయినా కల్తీ సారా తాగి మరణించలేదని బుకాయిస్తూ, ఈ మరణాలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. 
 
ఈ నేపథ్యంలో టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సారథ్యంలోని టీడీపీ ఎమ్మెల్యేలు, నేతల బృందం జంగారెడ్డిగూడెంకు బస్సులో బయలుదేరారు. పార్టీ కేంద్ర కార్యాలయమైన ఎన్టీఆర్ భవనం నుంచి ప్రత్యేక బస్సులో వారు జంగారెడ్డిగూడెంకు వెళ్లారు. ఈ సందర్భంగా వారు మృతుల కుటుంబాలను పరామర్శించి మొత్తం 27 కుటుంబాలకు రూ.లక్ష చొప్పున రూ.27 లక్షల ఆర్థిక సాయం అందజేయనున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు