దిశ చ‌ట్టం ఉందా? లేదా? ఉంటే అమ‌లు చేయండి...

గురువారం, 9 సెప్టెంబరు 2021 (11:38 IST)
హత్యకు గురైన అనూషకు ఏడాది అయినా న్యాయం చేయలేని ప్రభుత్వ అసమర్థతను నిలదీసేందుకు నరసారావుపేటకు లోకేష్ వెళ్తుంటే, పోలీసులు అనుమతి లేదని చెప్పడం దుర్మార్గమ‌ని టీడీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పంచుమ‌ర్తి అనూరాధ విమ‌ర్శించారు. టీడీపీ నేతలను ఎందుకు అరెస్టులు చేసి, గృహ నిర్భందిస్తున్నారు? పోలీసుల చర్యను ఖండిస్తున్నాన‌ని తెలిపారు. పరామర్శించే స్వేచ్చ ప్రతిపక్షాలకు లేదా? మహిళలని కూడా చూడకుండా లారీల్లో ఎత్తి పడేస్తున్నారు. దిశ చట్టం వుందో లేదో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఉంటే అమలు చేయండి. లేకుంటే చట్టం లేదని చెప్పండి. ఎన్నాళ్లు మహిళలను తప్పుడు ప్రకటనలతో మభ్యపెడతారు? అని ప్ర‌శ్నించారు. 
 
సీఎం ఇంటి పక్కన అత్యాచారం జరిగితే, నిందితున్ని పట్టకోలేదు. రమ్యను హత్య చేస్తే పరామర్శించడానికి తీరిక లేదు. తాడేపల్లి నుండి అడుగు బయటపెట్టాలంటే జగన్ వణికిపోతున్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో అసహనం పెరిగిపోతోంది. జగన్ ప్రజల నుండి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. దాన్ని పోలీసులతో తొక్కిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మల్లా పోలీసులు తయారయ్యారు. ప్రభుత్వం చేసే తప్పులను పోలీసులను వెనకేసురావద్దు. ప్రభుత్వం ఏ ఆట ఆడిస్తే పోలీసులు అదే ఆడుతున్నారు. వైసీపీ రాసిన స్క్రిప్టు చదివి హోంమంత్రి అబాసుపాలు అయ్యారు. ఇప్పటికైనా ప్రజలకు వాస్తవాలు  చెప్పిండి అని పంచుమర్తి అనురాధ కోరారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు