సూర్యాపేట మండలంలోని ఓ తండాలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు అదే ప్రైవేట్ పాఠశాలలో ఇన్విజిలేటర్‌గా విధుల్లో ఉన్నాడు. బాలిక పరీక్షలో చూసి రాసేందుకు కొంత సహకారం అందించి, ఏవేవో మాటలు చెప్పి పరీక్ష పూర్తయ్యాక కేంద్రం బయట వేచి ఉండాలని ఆమెకు సూచించాడు.
బాలికను ఇంటివద్ద దింపుతానని చెప్పి తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారయత్నం చేశాడు. బాలిక అక్కడి నుంచి అతి కష్టంమీద తప్పించుకుని ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని తన పెద్దమ్మకు వివరించింది. బాలికకు తల్లిదండ్రులు లేకపోవడంతో పెద్దమ్మ ఇంటి వద్ద ఉంటూ చదువుకుంటోంది. బాలిక పెద్దమ్మ 100 నంబరుకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని తెలియజేసింది.
పోలీసులు టీచర్‌ని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత ఉపాధ్యాయుడి తరఫున రంగంలోకి దిగిన పెద్ద మనుషులు బాలిక బంధువులకు నచ్చజెప్పారు. పెద్దమనుషులు బాధితులకు కొంత నగదు ముట్టజెప్పి విషయం బయటకు పొక్కకుండా ప్రయత్నాలు చేశారని తెలిసింది. ఫిర్యాదు ఇవ్వాలని కోరినా కుటుంబసభ్యులు ఎవరూ ముందుకు రావడం లేదని సూర్యాపేట ఇన్‌స్పెక్టర్ శివశంకర్ తెలిపారు.