సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని హత్య కేసులో ఆమె భర్త అరెస్ట్ అయ్యాడు. ఇటీవల తిరుపతిలో భువనేశ్వరి అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిన హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్యకేసులో భర్త శ్రీకాంతరెడ్డిని అలిపిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ నుంచి బెంగుళూరుకు వెళ్తుండగా నెల్లూరు వద్ద శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తిరుపతి రుయా ఆసుపత్రి ఆవరణలో ఇటీవల కాలిన స్థితిలో ఓ మృతదేహాన్ని గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన స్థానిక పోలీసులు.. అది పుంగనూరు మండలం రామసముద్రానికి చెందిన భువనేశ్వరి మృతదేహంగా గుర్తించారు.